శ్రీలంకను ఓ మోస్తరు స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా బౌలర్లు

  • పల్లెకెలెలో టీమిండియా, శ్రీలంక రెండో టీ20 మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసిన శ్రీలంక 
శ్రీలంకతో టీ20 సిరీస్ లో టీమిండియా బౌలర్లు మరోసారి స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన కనబరిచారు. నేడు పల్లెకెలెలో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా బౌలర్ల ధాటికి శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులకే పరిమితమైంది. టీమిండియా బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ 2, అక్షర్ పటేల్ 2, హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో కుశాల్ పెరీరా 53, పత్తుమ్ నిస్సాంక 32, కమిందు మెండిస్ 26 పరుగులు చేశారు. కెప్టెన్ చరిత్ అసలంక 14 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

Team India
Sri Lanka
2nd T20
Pallekele

More Telugu News